ధర్మ మహేష్ హీరో అయిన తరువాత విశ్వరూపాన్ని చూపించాడని భార్య గౌతమి మీడియాతో వెల్లడించింది. తాజాజా ఆమె మాట్లాడుతూ పోలీసులు అంటే ధర్మ మహేష్ కి లెక్క లేదు. నన్ను నా కుటుంబాన్ని తుపాకులతో కాల్చి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. రూ.500 కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడు. హీరో కాకముందు చాలా బాగుండేవాడు. హీరో అయిన తరువాత తాను రియల్ హీరోలా పీల్ అవుతున్నాడని తెలిపింది.
తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే తనను చంపాలని ప్రయత్నించాడు. తనకు బిడ్డ పుట్టిన తరువాత కూడా తండ్రిగా అంగీకరించడం లేదు. నిత్యం వేధింపులకు గురి చేస్తూ.. వరకట్నం తీసుకురావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భార్య గౌతమి మీడియాతో వాపోయింది. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని తన గోడును వెల్లబోసుకుంది. పోలీసులకు లంచం ఇచ్చి తనపై కేసు లేకుండా చేసుకుంటానని.. పలుమార్లు ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. తనను, తన కుటుంబాన్ని తుపాకులతో కాల్చి చంపేస్తానని.. ఇష్టానుసారంగా నోటికివచ్చినట్టు మాట్లాడుతాడని తెలిపింది.