అంబానీ తల్లి కోకిలాబెన్ కి తీవ్ర అస్వస్థత

-

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) తల్లి కోకిలాబెన్‌ అంబానీ ఆస్పత్రిలో చేరారు. కోకిలాబెన్‌ అంబానీ (Kokilaben Ambani) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ముంబై లోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రికి (HN Reliance Hospital) తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు నేషనల్ మీడియా పేర్కొంది.

Kokilaben Ambani
Kokilaben Ambani

అంబానీ కుటుంబ సభ్యులు హుటాహుటిన దక్షిణ ముంబైలోని రిలయన్స్‌ ఆస్పత్రికి వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అందులో అనిల్‌ అంబానీ (Anil Ambani), ఆయన భార్య ఓ కారులో వెళ్తుండగా.. ముకేశ్‌ అంబానీ ఫ్యామిలీ ఫుల్‌ సెక్యూరిటీతో ఆస్పత్రికి చేరుకుంది. ప్రస్తుతం కోకిలాబెన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, ప్రస్తుతం ఆమె వయసు 91 ఏండ్లు. వయో సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news