తన తండ్రిపై గత కొంతకాలంగా వస్తున్న ట్రోల్స్పై స్పందించారు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య. తాను దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఈ విషయంపై ఆమె మాట్లాడారు. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రజనీ అతిథి పాత్రను పోషించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ సోషల్ మీడియాకు తాను చాలా దూరంగా ఉంటానని.. ఆన్‌లైన్ నెగెటివిటీ గురించి తన టీమ్ తరచూ చెబుతుంటుందని తెలిపారు. వాటి వల్ల తాను ఆగ్రహానికి గురైన సందర్భాలున్నాయని చెప్పారు.
‘ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే.. ఆయన ‘లాల్ సలామ్’లో నటించేవారు కాదు’’ అని ఐశ్వర్య తెలిపారు. ఆమె మాటలు విన్న రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఈటీవల ‘‘జైలర్’ ఈవెంట్‌లో భాగంగా ‘అర్థమైందా రాజా’ అంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు విజయ్పై పరోక్షంగా మాటల దాడి చేశానని అన్నారని.. అవి తనను ఎంతో బాధించాయని తెలిపారు. తన కళ్ల ముందే పెరిగి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాడిపై తాను అలా ఎందుకు మాట్లాడతానని.. ఆ వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.