అక్కినేని అఖిల్ నుంచి చాలా కాలం తర్వాత కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8వ తేదీ (ఇవాళ) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అయ్యగారి కొత్త ప్రాజెక్టు అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అఖిల్ హీరోగా.. శ్రీలీల ఫీ మేల్ లీడ్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఇవాళ మేకర్స్ ఈ చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు. 1.04 నిమిషాల పాటు సాగిన ఈ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది.
‘గతాన్ని తరమడానికి పోతా.. మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరుంటాది రా పేరుండది. అట్నే పోయెటప్పుడు ఊపిరుండది పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరెట్ల నిలబడాలంటే’.. అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. మనం ఎంటర్ప్రైజెస్ తో పాటు నాగవంశీ సితార బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే ఈసారి అఖిల్ పక్కా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు.