వావ్.. పవన్‌ జర్నీపై అకీరా స్పెషల్‌ వీడియో

-

ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ అంతా సంబురాల్లో మునిగిపోయింది. తమ ఆనందాన్ని సోషల్ మీడియాలోనూ వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యామిలీ సభ్యులు. ఈ నేపథ్యంలో పవన్‌ కుమారుడు అకీరా ఎడిట్‌ చేసిన వీడియోను రేణూ దేశాయ్‌ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఇక కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్‌ దీనికి క్యాప్షన్‌ పెట్టారు. ‘ఖుషి’ నుంచి ‘భీమ్లానాయక్‌’ వరకు పవన్‌ చేసిన సినిమాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగులతో దీన్ని ఎడిట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుండగా ‘గూస్‌బంప్స్‌ వస్తున్నాయంటూ’ నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Read more RELATED
Recommended to you

Latest news