కుర్ర హీరోకు లిఫ్ట్ ఇస్తున్న నాగార్జున‌!

-

సినీ నేప‌థ్యం లేకుంటే ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మే. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. కానీ కొంత మంది మాత్రం సినీ నేప‌థ్య కుటుంబం నుంచి రాక‌పోయినా రాణిస్తున్నారు. ఫ్లాపులొచ్చినా త‌ట్టుకుని నిల‌బ‌డుతున్నారు. అలా నిల‌బ‌డి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ఆడియ‌న్స్‌నీ విస్మ‌య‌ప‌రుస్తున్నాడు రాజ్ త‌రుణ్. ఉయ్యాల జంపాల‌` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ త‌రువాత అంచ‌లంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు.

అయితే అత‌న్ని ఇటీవ‌ల వ్య‌క్త‌గ‌తంగా , వృత్తి ప‌రంగా ఇబ్బందులు చుట్టుముట్టాయి. అలాంటి స‌మ‌యంలో రాజ్ త‌రుణ్‌కు అండ‌గా నిల‌వాల‌ని దిల్ రాజు `ఇద్ద‌రి లోకం ఒక‌టే` అంటూ మూవీ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. రాధామోహ‌న్ చేసిన `ఒరేయ్ బుజ్జిగా` క‌రోనా కార‌ణంగా `ఆహా` ఓటీటీకి వెళ్లిపోయింది. దీంతో కొంత గంద‌ర‌గోల ప‌రిస్థితుల్లో వున్న రాజ్ త‌రుణ్‌కు కింగ్ నాగార్జున అండ‌గా నిలిచిన‌ట్టు తెలిసింది. `ఉయ్యాల జంపాల‌`తో రాజ్‌త‌రుణ్‌ని ప‌రిచ‌యం చేసిన నాగ్ మ‌రోసారి ఈ కుర్ర హీరోకు లిఫ్ట్ ఇస్తున్నారు. `సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు` ఫేమ్ శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని రాజ్ త‌రుణ్ హీరోగా నాగ్ నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే నెల 14న ఈ మూవీ ప్రారంభం కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news