పబ్ జీ ప్లేస్ లో కొత్త గేమ్ ప్రకటించిన అక్షయ్ కుమార్…!

-

జనాదరణ పొందిన పబ్ జీ గేమ్ బాన్ తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేసాడు. శుక్రవారం (సెప్టెంబర్ 4), పిఎమ్ నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ ఉద్యమానికి మద్దతుగా రాబోయే మల్టీప్లేయర్ గేమ్ FAU-G ని ప్రకటించాడు. యాక్షన్- మల్టీప్లేయర్ గేమ్‌ ను అక్షయ్ సమర్పించనున్నారు. ఈ గేమ్ ద్వారా వచ్చే నికర ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వబడుతుంది.

ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఈ విషయాన్ని అక్షయ్ పోస్ట్ చేసాడు. ప్రధాని నరేంద్రమోడి ఆత్మ నిర్భార్ ఉద్యమానికి మద్దతు ఇస్తూ, మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్, ఫియర్లెస్ అండ్ యునైటెడ్ – గార్డ్స్ FAU-G ను ప్రకటించడం గర్వంగా ఉందని పోస్ట్ చేసాడు. వినోదంతో పాటు, ఆటగాళ్ళు మన సైనికుల త్యాగాల గురించి కూడా నేర్చుకుంటారు. వచ్చే నికర ఆదాయంలో 20% భారత్‌ కీ వీర్ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వబడుతుందని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version