మాస్కు లేదని 27 లక్షల ఫైన్…!

-

ఒక పక్క కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే మాస్క్ లు లేకుండా తిరుగుతున్న వారి విషయంలో పోలీసులు సీరియస్ గా ఉన్నారు. మాస్క్ లు ధరించకుండా బహిరంగంగా బయటకు అడుగుపెట్టినందుకు గత ఐదు నెలల్లో 2,700 మందికి పైగా బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ జరిమానా విధించినట్లు ఒక అధికారి శుక్రవారం తెలిపారు. వైరల్ వ్యాప్తి తరువాత కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఏప్రిల్ 9 నుండి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు తప్పనిసరి చేసింది . ముంబైలోని కార్పోరేషన్ అధికారులు ఏప్రిల్ 9 మరియు ఆగస్టు 31 మధ్య 2,798 మంది పౌరుల నుండి మొత్తం రూ .27.48 లక్షల జరిమానాను వసూలు చేసిందని అధికారి తెలిపారు. మాస్క్ లు ధరించని కనీసం 9,954 మంది పౌరులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 1,000 జరిమానా వసూలు చేయాలని బృహన్ ముంబై ఆదేశాలు ఇచ్చింది. కే-వెస్ట్ వార్డులో రూ .5.04 లక్షలు జరిమానా వసూలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version