నందమూరి తారకరత్న మరణించి దాదాపుగా నెలరోజులు పైగానే గడిచిపోయింది. అంతా ఒక కలలా జరిగిపోయిందని అభిమానులు సైతం భావిస్తున్నారు ముఖ్యంగా ఈ షాక్ నుంచి వారి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు అని చెప్పవచ్చు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న జనవరిలో గుండెపోటుకి గురై దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. కొడుకుతో సమానమైన తారకరత్న మరణించడంతో అన్ని కార్యక్రమాలను బాలయ్య దగ్గరుండి మరీ చూసుకున్నారు. తారకరత్న ఫ్యామిలీకి బాలకృష్ణ పెద్దదిక్కుగా మారారు.
ఇకపోతే తాజాగా బాలకృష్ణ తన మంచి మనసును మరొకసారి చాటుకుంటూ చేసిన గొప్ప పని అలేఖ్య రెడ్డి చేత దేవుడు అనిపించేలా చేసింది.. తారకరత్న జ్ఞాపకార్థం గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారట. గుండె సమస్యలు ఎంత ప్రమాదకరమో తారకరత్న విషయంలో బాలకృష్ణ దగ్గరుండి మరీ గమనించారు. అందుకే గుండె సమస్యలతో బాధపడుతూ చికిత్స ఖర్చులు భరించలేని పేదవారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.
ఈ మేరకు బసవతారకం ఆసుపత్రిలో ఒక బ్లాక్ కి తారకరత్న బ్లాక్ అని నామకరణం కూడా చేశారు. గుండె సమస్యలకు ఉచిత వైద్యం, బసవతారకం ఆసుపత్రితో, హిందూపురంలో బాలయ్య నిర్మించే ఆసుపత్రిలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విషయం తెలిసి బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. దీనిపై అలేఖ్య రెడ్డి కూడా పోస్ట్ పెడుతూ..” నేనేం మాట్లాడగలను.. మిమ్మల్ని బంగారు బాలయ్య అని పిలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు… మీరు మాకు తండ్రి , స్నేహితుడు కంటే ఎక్కువ.. ఇప్పుడు మీలో దేవుడిని చూస్తున్నాను.. జై బాలయ్య..” అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టారు.