హైదరాబాద్ లో గత రెండు రోజుల నుంచి మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రోడ్లమీద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం నెలకొంది.

దీంతో హైదరాబాద్ నగర పోలీసులు ఈరోజు అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అందువల్ల ఎవరూ కూడా బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. కుదిరితే ఉద్యోగుల సైతం వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం అస్సలు బయటికి రాకూడదని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా మరో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.