ఆలీ రెజా ఇంకా కోలుకోలేదా… అస‌లేం జ‌రిగింది…

-

బిగ్‌బాస్-3 హౌస్‌లో అలి రెజా ఎంతో హ‌డావిడి చేసేవాడు. టాస్క్‌ల విష‌యంలో అలి క‌ష్ట‌ప‌డిన‌ట్టు ఎవ్వ‌రూ క‌ష్ట‌ప‌డే వారు కాదు. అయితే అనూహ్యంగా అత‌డు ఫైన‌ల్స్‌లో ఉంటాడ‌ని అంద‌రూ ఊహించ‌గా 50 రోజుల‌కే ఎలిమినేట్ అయ్యాడు. అత‌డు ఎలిమినేష‌న్స్ జోన్‌లోకి వ‌చ్చిన తొలిసారే ఎలిమినేట్ అయ్యాడు. ఇక అలీకి బిగ్‌బాస్ ఇంట్లో నుంచి వ‌చ్చి సొంత ఇంటికి వెళ్లిన వెంట‌నే విషాద వార్త తెలిసింది.

తాను హౌజ్‌లో ఉన్న సమయంలో తన మామయ్య చనిపోయాడని తెలియడంతో అలీ రెజా తీవ్ర ఆవేదన చెందాడు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన అలీ విషాదంలో కూరుకుపోయాడు. తాను జీవితంలో ఉన్న‌త స్థానానికి వెళ్లాల‌ని త‌న మావ‌య్య ఎప్పుడూ కోరుకునేవాడ‌ని.. కాని ఇప్పుడు త‌న కంటూ జ‌నాల్లో ఓ మంచి పేరు, అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తోన్న టైంలో ఆయ‌న చూడ‌లేక‌పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మావ‌య్య చ‌నిపోయిన విష‌యం త‌న‌కు అమ్మ‌, నాన్న చెప్ప‌లేద‌ని… అది చెపితే హౌస్‌లో త‌న‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని వాళ్లు భావించార‌ని అలీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిగ్‌బాస్ అనేది త‌న కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్ అని… ఆ విష‌యం తెలిసే త‌న త‌ల్లిదండ్రులు ఈ విష‌యం హౌస్‌లో ఉన్న‌ప్పుడు త‌న‌తో చెప్ప‌లేక‌పోయార‌ని వాపోయాడు. మామయ్య మృతితో ఇంట్లోవాళ్లంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి బయటపడి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చివరగా, ‘మామా నువ్వు బెస్ట్.. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ అంటూ అలీ రెజా తన ఆవేదన సోష‌ల్ మీడియా ద్వారా వ్య‌క్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news