అల్లరి నరేష్ నాంది నుండి క్రేజీ టీజర్.. న్యాయం కోసం ప్రాణత్యాగం..

కెరీర్లో యాబై ఆరు చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్, యాభై ఏడవ చిత్రంతో తనని తాను మార్చుకుంటూ కొత్తదారికి నాంది పలుకుతున్నాడు. నాంది అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే చిన్నపాటి టీజర్ రిలీజ్ చేసి అందరిలో ఆసక్తి కలగజేసిన నాంది చిత్ర బృందం, తాజాగా బ్రీత్ ఆఫ్ నాంది సరికొత్త టీజర్ తో ముందుకు వచ్చింది.

ఈ టీజర్ లో అల్లరి నరేష్ బందీగా కనిపిస్తున్నాడు. అలా కట్టిపడేసిన అల్లరి నరేష్, వగరుస్తూ, కొన్ని మాటలు చెప్పాడు. 15లక్షల మంది తమ ప్రాణం త్యాగం చేస్తే గానీ ఇండియాకి స్వాతంత్ర్యం రాలేదు. 1300 ప్రాణాలు బలి తీసుకుంటే గానీ ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. న్యాయం ఎప్పుడూ ప్రాణం పోయిన తర్వాతే వచ్చింది. అలాంటి న్యాయం కోసం నా ప్రాణం పోయిన ఫర్వాలేదు అని అంటున్నాడు. టీజర్ లో మాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తుండగా, విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.

BB