ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎవరి ఊహకి అందని విధంగా మహమ్మారి కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ భయంకరమైన కరోనా వైరస్ ఎఫెక్ట్ దేశంలో అన్ని రంగాలపై ఊహించని ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం తీసుకొన్నా లాక్ డౌన్ ఎఫెక్టుతో దేశంలో అన్ని రంగాల్లో మూతపడ్డాయి . సినిమారంగం కూడా మూతపడింది.
ఈ సందర్భంగా ఆహా ఓటీటీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సరికొత్త క్రేజ్ ఉండేవిధంగా అల్లు అరవింద్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ట్యాలెంటెడ్ డైరెక్టర్స్, ప్రముఖ దర్శకులకు అల్లు అరవింద్ స్వయంగా కాల్ చేసి వెబ్ సిరీస్‌ల కోసం మంచి కాన్సెప్ట్‌లు రెడీ చేయమన్నాడట. వీలైతే కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సినిమా రంగంలో సక్సెస్ అయిన అల్లు అరవింద్ వెబ్ సిరీస్ రంగంలో అడుగు పెట్టడంతో ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.