కోలీవుడ్ ని ఫాలో అవుతున్న టాలీవుడ్.. ఓటీటీలను నమ్ముకుంటే భారీగా దెబ్బ తినేది వీళ్ళే …?

-

కరోనా మహమ్మారితో చిత్ర పరిశ్రమలన్ని 2020 లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రభావం ఇప్పట్లో తగ్గడం కూడా చాలా కష్టమని చిత్ర పరిశ్రమలోని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలన్ని ల్యాబ్ లోనే ఉండిపోయాయి. ఆ సినిమాలను ఇప్పట్లో రిలీజ్ చేసే ఆలోచన కూడా మేకర్స్ కి లేదని అంటున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలనైతే నిర్మాతలు ఇప్పట్లో రిలీజ్ చేయకూడదనే ఉన్నారు.

 

అయితే మరికొంతమంది మాత్రం మరీ ఎక్కువ రోజులైతే ఆర్ధికంగా బాగా నష్టం వాటిల్లుతుందన్న భావలోను ఉన్నారు. అందుకు ప్రత్యామ్నయంగా ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ని చేస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య నటించిన సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిపారు. కాని ఆఖరి నిముషంలో వివాదాలు తలెత్తాయి.

 

ఇదే గనక జరిగితే ఇక సూర్య గాని అతని తమ్ముడు కార్తి గాని నటించిన సినిమాలని థియోటర్స్ లో విడుదల కానివ్వమంటూ డిస్ట్రిబ్యూటర్స్ అడ్డం తిరిగారు. ఇలా సినిమాలని ఓటీటీ లో రిలీజ్ చేస్తే ఇక జనాలు థియోటర్స్ కి రారన్న ఆలోచనే ప్రధాన కారణం. అయితే ఇక్కడ చిన్న సినిమాల వరకు ఓకే గాని భారీ బడ్జెట్ సినిమాల సంగతే మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఇదే ఆలోచనని టాలీవుడ్ మేకర్స్ కూడా చేస్తున్నారట. అయితే ఓటీటీ లో భారీ బడ్జెట్ సినిమాలని కొనడానికి ముందుకు రావడం అంత ఈజీ కాదు.

 

4-5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు అది కూడా కంటెంట్ బావుంటే కొంటారు తప్ప లేదంటే లేదు. కాని వకీల్ సాబ్ లాంటి సినిమాలని ఓటీటీ లో రిలీజ్ చేయాలంటే జరిగే పని కాదని అంటున్నారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ..ఇలా అందరు దారుణంగా భారీ స్థాయిలో ఆర్ధిక నష్ఠాలను చూడాల్సి వస్తుందని ఈ ఆలోచన ఎంత మాత్రం సరైనది కాదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version