NTR ‘దేవర’లో అల్లు అర్హ.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్

-

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ దేవర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ జాన్వీ కపూర్​ చిన్నప్పటి పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాలో అల్లు అర్హ నటించేందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వచ్చే నెలలో ఈ చిన్నారి పాత్రకు సంబంధించిన షూటింగ్ చేస్తారట.

ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలు ఉండనుందని ాక్ వినిపిస్తోంది. అయితే ఈ పది నిమిషాలకే అర్హకు రూ.20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఒక్కో నిమిషానికి రెండు లక్షలు అన్నమాట.

అల్లు అర్హకు సోషల్​మీడియాలోనూ మంచి ఫాలోయింగ్​ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అర్హ. ఈ సినిమాలో భరతుడిగా నటించి స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. తన ముద్దులొలికే మాటలతోనే చిన్నారి భరతుడి రాజసాన్ని ప్రతిబింబించేలా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version