ఇటీవల కాలంలో సెలబ్రిటీల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ చైల్డ్ ఆర్టిస్ట్ గా తమకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఒకరు. ఈ పాప గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాలో భరతుడి చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్హ ప్రతిభను మెచ్చుకొని సమంత దగ్గరుండి ఆ పాపకి అన్ని సౌకర్యాలను అందజేసింది. ఇక ఈ పాప ప్రతిభ చూస్తే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వా. ఇటీవల చెస్ ఆటలో అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ చిన్నారి.
ఇక అల్లు అర్హ వీడియోను ఒక రీల్ గా చేసి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకోగా..నేటిజెన్లు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు . ముద్దు ముద్దుగా అల్లు అర్హ పరిగెత్తడం చూసి బన్నీ ఫ్యాన్స్ కూడా మురిసిపోతూ ఉండడం గమనార్హం.