Pushpa: అంచనాల‌ను రెట్టింపు చేసేలా పుష్ప క్రేజీ అప్డేట్..! శ్రీ వ‌ల్లి ప్రోమో సాంగ్ విడుద‌ల‌..!!

Pushpa: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేష‌న్లో హ్యాట్రిక్ సినిమాగా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌లో విడుదల అవుతోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మీక మదన నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న‌కు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ చిత్రం నుంచి వ‌చ్చిన ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

హీరోయన్‌గా రష్మిక మందన పోషిస్తున్న ‘శ్రీవల్లి’ పాత్రపై రూపొందించిన పాట ప్రోమోని విడుద‌ల చేశారు. ‘చూపే బంగారమయనే శ్రీవల్లి’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన వీడియోని 19 సెకన్ల ప్రోమోగా వ‌దిలారు. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు.

చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు. రేపు ఉద‌యం ఫుల్ సాంగ్ విడుద‌ల కానుంది. పాటలోని రెండు లైన్లే ఇంత బాగుంటే ఇక పాట ఎంత బాగుంటుందో అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

https://youtu.be/sf4ICWFojUA?list=PL0ZpYcTg19EGEGlkMPr_eCF6a-Z1yaLWm