మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, జనసేన నేత నాగబాబు ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు మెగాస్టార్ తో అల్లు అర్జున్ బేటీ అయ్యారు. నిన్న మొత్తం అల్లు అర్జున్ ను తన నివాసంలో పలువురు సినీ ప్రముఖులు కలిశారు. ఇవాళ అల్లు అర్జున్ మెగా స్టార్ చిరంజీవి, నాగబాబును కలిశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ని కలవకుండానే హైదరాబాద్ నుంచి నేరుగా ఏపీకి వెళ్లారు.
శనివారం అంతా కూడా బన్నీ ఇంటికి సెలెబ్రిటీలు క్యూ కట్టారు. కానీ బన్నీ మాత్రం ఆదివారం నాడు ఇలా మెగా ఇంటి బాటపట్టారు. చిరంజీవిని కలిసేందుకు అల్లు ఫ్యామిలీ అంతా వెళ్లింది. లంచ్ చేస్తూ దాదాపు గంటకు పైగానే ముచ్చట్లు పెట్టారు. ఆ తరువాత వెంటనే బన్నీ వెనుదిరిగి వెళ్లినట్టుగా కనిపించింది. అయితే ఇప్పుడు సాయంత్రం నాగబాబు ఇంటికి బన్నీ వెళ్లాడు.