ఐకాన్ స్టార్ ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. అట్లీతో బన్నీ మూవీ క్యాన్సిల్!

-

ఐకాన్​స్టార్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు షాకింగ్ న్యూస్. స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ‘పుష్ప- 2’ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్ కూడా వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా అటకకెక్కినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బన్నీ- అట్లీ కాంబో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాకు దర్శకుడు అట్లీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అడిగారట. రూ.80 కోట్లు పారితోషికంగా అడిగినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రొడక్షన్.. కేవలం డైరెక్టర్​కు అంత మొత్తంలో చెల్లించడానికి రెడీగా లేనందున ప్రాజెక్ట్ అగ్రిమెంట్ రద్దు అయినట్లు తెలిసింది. దీంతో అట్లీ అదే కథను ఇంకో హీరోకు చెప్పారంట. ఏదేమైనా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక గతేడాది అట్లీ- బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ లీడ్​ రోల్​లో ‘జవాన్’ తెరకెక్కించగా ఈ సినిమా రూ. 1000+ కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమాతో అట్లీ క్రేజ్ సౌత్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news