ఆర్టీసీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పెద్ద స్కాం – క్రిశాంక్‌

-

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ను మరోసారి మన్నె క్రిశాంక్ టార్గెట్‌ చేశారు. పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశాడని….స్కాంలతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుందని వెల్లడించారు. లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కాం వరకు అన్ని స్కాంలేనని….ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కాం చేశారు. లో లోపల ఈ స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు మన్నె క్రిశాంక్.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు మన్నె క్రిశాంక్. ఆర్టీసీ టికెట్స్ పెంపుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతాం అని భయపెడుతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల ప్రభుత్వంగా మారిందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ ఓపెన్‌గా జరిగిందన్నారు మన్నె క్రిశాంక్. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై మేం మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు.. మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కోర్టు ముందు పెట్టి కేసు వేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news