సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు బన్నీని తరలిస్తున్నారు. చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. పోలీస్ స్టేషన్ బయట ఉన్న అభిమానులను చూసి బన్నీ అభివాదం చేశారు.
వాస్తవానికి మధ్యాహ్నం 2:30 గంటలకు క్వాష్ పిటిషన్ విచారణ జరగాలి. కానీ హై కోర్టు సాయంత్రం 4 గంటలకు కోర్టు వాయిదా వేసింది. ఈ క్వాష్ పిటిషన్ లో ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని దాఖలు చేశారు. ఇవాళే నాంపల్లి కోర్టు, తెలంగాణ హైకోర్టులో ఒకే రోజు విచారణ జరుగుతుండటంతో ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు గాంధీ ఆసుపత్రి, నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ నాంపల్లి కోర్టు కనుక రిమాండ్ విధిస్తే.. అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.