నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళతారని అంటున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పేపర్లు స్వయంగా సమర్పించనున్నారు అల్లు అర్జున్. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా హజరు కావాలన్న షరతును సడలించాలని న్యాయమూర్తిని విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ తరుణంలోనే.. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళతారని అంటున్నారు.
కాగా, అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నిన్న ఆదేశించింది కోర్టు. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల నగదు, రెండు పూచీకత్తులను సమర్పించాలని, విచారణకు సహకరించాలని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని షరతులతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు.