ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ట్వీట్ చేశారు. భారతదేశం రెండు అణు పరీక్షలు నిర్వహించిందని, ఆ సమయంలో శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం చేసిన సేవలు మర్చిపోలేనివని సీఎం చంద్రబాబు అన్నారు. అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం శనివారం ఉదయం ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతిపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. రాజగోపాలం చిదంబరం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 1975, 1998లో దేశం నిర్వహించిన రెండు అణు పరీక్షల్లో రాజగోపాల చిదంబరం కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. భారతదేశ అణుశక్తి విభాగానికి చిదంబరం నాయకత్వం వహించారని ఈ సందర్బంగా ఆయన దేశానికి అందించిన సేవలను చంద్రబాబు కొనియాడారు.
భారతదేశ అణుశక్తి విభాగానికి నాయకత్వం వహించి ఆయుధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం గారి మరణం విచారకరం. దేశం నిర్వహించిన రెండు అణు పరీక్షలలో చిదంబరం గారి పాత్ర చిరస్మరణీయం. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ… వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని… pic.twitter.com/ixFGEVX0zK
— N Chandrababu Naidu (@ncbn) January 4, 2025