తండ్రిని బే అన్న అర్హ… వైరల్ అవుతున్న వీడియో

-

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య మనవడు,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అని చెప్పడం కన్నా తనకంటూ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. ఎప్పుడూ సినిమాలతో బిజీ గా ఉండే అల్లు అర్జున్ అప్పుడప్పుడు కూతురు అర్హ తో కలిసి వీడియో లు చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. వారి వీడియోలు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి కూడా. తాజాగా వారిద్దరికీ సంబందించిన మరో వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో లో తండ్రి,కూతురు ఇద్దరూ కూడా బే అంటూ సంభాషించుకుంటూ తెగ నవ్వులు కురిపించారు. ఆ వీడియో లో అల్లు అర్జున్ కూతురు ని నీ ఫెవరెట్ కలర్ ఏంటి బే అని అడుగగా,పింక్ బే అంటూ సమాధానం చెప్పడం తో వెంటనే అల్లు అర్జున్ కన్న తండ్రిని బే అంటావా అని పదే పదే అడుగగా అవును బే అంటూ అర్హ సమాధానం ఇవ్వడం అంతా ఫన్నీగా సాగిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో కూడా అల్లు అర్జున్,కూతురి తో కలిసి కొన్ని వీడియో లు చేయగా, దానిలో ఒక వీడియో లో ఇలానే నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పమంటే, చేసుకోను అంటూ టక్కున సమాధానం చెబుతుంది. ఆ వీడియో కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా ఎదిగి తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల అల్లు అర్జున్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన “అల…వైకుంఠపురంలో…’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version