గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించారు నటుడు అల్లు అర్జున్. పుష్ప2 చిత్రానికి ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా అంటూ పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.

ఉత్తమ నటుడిగా అవార్డు దక్కిన ఘనతంతా మా దర్శకుడు సుకుమార్, నిర్మాతలు, పుష్ప టీమ్ దే అని వెల్లడించారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ వార్డును మా అభిమానులకు అంకితం చేశారు. అభిమానులు చూపించే అవాజ్యమైన ప్రేమ, మద్దతు నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయన్నారు నటుడు అల్లు అర్జున్.
ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా గద్దర్ అవార్డులు ప్రకటిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.