అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు.. గీతా ఆర్ట్స్ అత‌నికేనా..?

తెలుగు ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు ఉన్న అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తన ఆస్తిపాస్తులను ముగ్గురి కుమారులైన‌ అల్లు వెంకటేష్.. అల్లు అర్జున్.. అల్లు శిరీష్ లకు సమానంగా పంచి ఇచ్చినట్లు తెలుస్తుంది.

గత కొంతకాలంగా అల్లు అరవింద్ ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అల్లు అర‌వింద్ అస్తుల పంప‌కం చేశార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే గీతా ఆర్ట్స్ వ్యవహారాలను అల్లు వెంకటేష్ చూసుకుంటారని సమాచారం. అందుకే వరుణ్ తేజ్ సినిమాకు కూడా ఈయన పేరు నిర్మాతగా పడుతుంది.

ఇక అల్లు అర్జున్ ఎలాగూ గీతా ఆర్ట్స్ 2 ను బన్నీ వాసు సహాయంతో చక్కగా రన్ చేస్తున్నాడు. ఆ సంస్థ త్వరలోనే డిజిటల్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. వాస్తవానికి శిరీష్ కు గీత ఆర్ట్స్ బాధ్యతలు అప్పచేప్పాలని అరవింద్ కోరిక‌.. కానీ అల్లు శిరీష్ నటనవైపు మొగ్గుచూపడంతో, మొన్నటివరకూ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ ను చూసుకొంటున్న అల్లు బాబికి అరవింద్ అప్పచెప్పార‌ని తెలుస్తోంది.