బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’

-

టాలీవుడ్ యంగ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. డైరెక్టర్ దుశ్యంత్‌ దర్శకత్వంnో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా వసూళ్లు సాధిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.8.06 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఈ క్రమంలో రిలీజైన మూడో రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను రీచ్ అయిందని సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో 2024లో హను-మాన్, నా సామిరంగ తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అందుకున్న మూడో సినిమాగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రికార్డు సొంతం చేసుకుంది.

దేశవ్యాప్తంగానే కాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల్లో ఓవర్సీస్లో 1,50,000 డాలర్లు కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version