కేసీఆర్ నల్లగొండను సర్వ నాశనం చేశాడు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాను సర్వ నాశనం చేశాడని రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి దక్షిణ తెలంగాణను నాశనం చేశాడు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేశాడు. ఉమ్మడి నల్లగొండ కరువు ఛాయలకు కారణం కేసీఆర్ అన్నారు. మేము వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే మాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. 

దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. మంత్రిగా జగదీశ్ రెడ్డి జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులపై ఏనాడు రివ్యూ చేయలేదు అన్నారు. కేసీఆర్ నల్లగొండకు వస్తే.. ప్రజలు తరిమి కొడతారు జాగ్రత్త అని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దేవరకొండ నుంచి కనగల్ వరకు ఉన్న రహదారి ఎలా ఉందో చూశారా..? దానిని ఎందుకు నిర్మించలేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండను నాశనం చేసి.. ఇప్పుడు నల్లగొండ వస్తారంట.. నల్లగొండకు వస్తే.. ఎన్నికల్లో ఓడించినిధంగానే నల్లగొండ ప్రజలు తిరగబడి తరిమి తరిమి కొడతారని పేర్కొన్నారు కోమటిరెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version