‘కల్కి’ సినిమాపై అమితాబ్ పోస్టు.. ఆ రూమర్స్కు చెక్

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ నెట్టింట కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక్క పోస్టుతో ఆ రూమర్స్కు చెక్ పడినట్లు అయింది.

‘‘కల్కి’ షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్లీ ఆలస్యమైంది. ఈ చిత్రీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా చెప్పిన సమాచారం ప్రకారమే మే 9న విడుదల కానుంది. ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వడానికి ఎంతోమంది కష్టపడి పని చేస్తున్నారు’ అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా విడుదల విషయంలో మరోసారి క్లారిటీ వచ్చింది. ఇందులో ప్రభాస్‌ భైరవగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా దీపికా పదుకొణె నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news