హేయ్ ట్విటర్ నేను డబ్బు కట్టా.. నా బ్లూ టిక్ ఏది: అమితాబ్ బచ్చన్

-

బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ సేవలకు సంబంధించిన రుసుము చెల్లించలేదన్న కారణంతో ట్విటర్‌ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్‌ మార్కును తొలగించిన విషయం తెలిసిందే. బ్లూ టిక్‌ మార్క్‌ కోల్పోయిన వారిలో రాహుల్‌గాంధీ, అమితాబ్‌ బచ్చన్‌, పవన్‌ కల్యాణ్‌, విరాట్‌ కోహ్లీ, సమంత తదితరులు ఉన్నారు. అయితే ఈ విషయంపై బిగ్ బీ స్పందించారు. తాను సబ్‌స్క్రప్షన్‌ సేవలకు రుసుము చెల్లించినా తన పేరు ముందున్న బ్లూ టిక్‌ మార్కును తొలగించడంపై బాలీవుడ్ మెగాస్టార్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.

“హేయ్‌ ట్విటర్‌.. నువ్వు వింటున్నావా..? సబ్‌స్క్రిప్షన్‌ సేవల కోసం నేను రుసుము చెల్లించా. కాబట్టి నా పేరు ముందు బ్లూ టిక్‌ మార్కును దయచేసి తిరిగి ఇచ్చేయండి. బ్లూ టిక్‌ తిరిగిస్తేనే నేను అమితాబ్‌బచ్చన్‌ అని జనాలకు తెలుస్తుంది. నేను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా” అని అమితాబ్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news