తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల మొదటి వారంలో జరిగిన పేపర్ లీక్ ల తతంగం గురించి తెలిసిందే. అయితే టెన్త్ హిందీ పేపర్ లీక్ అయిన విషయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రమేయం ఉందన్న కారణంతో అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఎఫ్ ఐ ఆర్ ను కొట్టి వేయమని బండి సంజయ్ తరపున లాయర్ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పైన హై కోర్ట్ విచారణ జరిగింది.
ఈ పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు కూడా ఇష్యు చేసింది . కానీ దీనిపై ఎటూ తేల్చని హై కోర్ట్ తర్వాత విచారణను జూన్ 16 కు వాయిదా వేయడం జరిగింది. ఒకరకంగా ఇది బండి సంజయ్ కు షాక్ అనే చెప్పాలి. మరి ఈ కేసులో ఇంకేమైనా పురోగతి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది.