టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కు లాక్‌డౌన్ కారణంగా బ్రేక్ పడగా మళ్ళీ యూనిట్ అంతా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు. అయితే ప్రభాస్ ఇప్పటికే తన నెక్ట్స్ రెండు సినిమాలను కూడా ప్రకటించేశారు. మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. వైజయంతి మూవీ అధినేత అశ్విని దత్ సినిమాను నిర్మించనున్నారు.
అయితే అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ సినిమాల అప్డేట్ల కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐతే పుట్టినరోజు దాకా వెయిట్ చేయకుండానే ప్రభాస్ అభిమానులకి సర్పైజ్ గిఫ్ట్ రాబోతుందని నిన్న రాత్రి వైజయంతీ బ్యానర్ ప్రకటించింది. అలా ప్రకటించినట్టుగానే కొద్దిసేపటి క్రితం ఆ అప్డేట్ ఇచ్చేసింది. ఉదయం పది గంటలకి ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడని ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇక పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా దీపికని ఫైనల్ చేయగా ఇప్పుడు మరో బాలీవుడ్ ;లెజెండ్ ని తీసుకోవడంతో వారు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.
Brace yourselves! we have a BIG announcement tomorrow at 10 AM.#Prabhas @deepikapadukone @nagashwin7 @AswiniDuttCh @SwapnaDuttCh @VyjayanthiFilms pic.twitter.com/brlAqGtNyB
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 8, 2020