ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలే విడుదలయ్యాయి. వాటిలో అనగనగా ఆస్ట్రేలియాలో అనే సినిమా ఒకటి. సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణంలో తారక రామ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందామా..?
సినిమా : అనగనగా ఆస్ట్రేలియాలో
దర్శకత్వం : తారకరామ
రచన : తారకరామ
స్క్రీన్ ప్లే : తారకరామ
నిర్మాత : బీటీఆర్ శ్రీనివాసరావు, యారిక్ స్టూడియోస్,
నటీనటులు : జ్యోతినాథ్ గౌడ్, సన్యా భట్నాగర్, జేడీఆర్ చెరుకూరి, రిషి, చంద్రశేఖర్ కొమ్మాలపాటి
రేటింగ్: 2.75 /5
స్టోరీ : క్యాబ్ డ్రైవర్ గా పని చేసే హీరో సింపుల్ గా జీవిస్తుంటాడు. మరోవైపు హీరోయిన్ చదువు కోసం అసైన్మెంట్స్ రాస్తూ డబ్బులు సంపాదిస్తూ తన ఫీజులు కట్టుకుంటుంది. మరోవైపు ఓ రాజకీయ నేత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటాడు. కానీ ఓ రహస్యం వల్ల అది సాధ్యం కాదు. అయితే ఆ రహస్యమేంటో తెలుసుకునే పనిని ఓ నేరస్థుడికి అప్పజెప్పుతాడు. ఇక హీరోయిన్ ఓరోజు తన అసైన్మెంట్ డబ్బులు తీసుకునేందుకు ఓ వ్యక్తి రూమ్ కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ పొరపాటున నేరసథుడి గదికి వెళ్లి అక్కడ కనిపించిన సామాను దొంగిలిస్తుంది. అలా తెలియకుండానే ఆ గదిలో జరిగే ఓ పెద్ద స్కాములో ఇరుక్కుంటుంది. ఈ కేసు గురించి తెలుసుకున్న హీరో, ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నించి తాను కూడా అందులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ నాయకుడు తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొస్తాడా? ఈ కేసు నుంచి హీరో, హీరోయిన్ ఎలా తప్పించుకుంటారు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
మూవీ ఎలా ఉందంటే: ఒక రహస్యం కోసం ఇద్దరు వ్యక్తులు వెతకడం.. ఈ క్రమంలో చోటుచేసుకునే సన్నివేశాలు మధ్యమధ్యలో కాస్త కామెడీ ఫస్టాఫ్ లో హైలైట్ గా నిలిచింది. స్కాములో చిక్కుకున్న హీరోహీరోయిన్లు దేశం విడిచి వెళ్లాలనుకున్న సమయంలో చోటుచేసుకునే ట్విస్ట్ మరో హైలైట్. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టుతో సినిమా మరో రేంజుకు వెళ్లిపోయింది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, అసలు తర్వాత ఏం జరగబోతోందనే ఆలోచన ప్రేక్షకుడికి తెప్పించడంలో డైరెక్టర్ తారకరామ సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో నెక్స్ట సీన్ లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించలోగానే ఊహించని రీతిలో ట్విస్టులు ఇచ్చి థ్రిల్ చేశాడు డైరెక్టర్.
ఎవరెలా చేశారంటే..? హీరోహీరోయిన్లు తమ నటనతో మెస్మరైజ్ చేశారు. సినిమాకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎంత బలంగా నిలిచిందో.. మధ్యమధ్యలో వచ్చే కామెడీ బిట్స్ కాస్త లైట్ ఫీలింగ్ ను ప్రేక్షకుడికి కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. హీరోహీరోయిన్లమధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
ప్లస్ పాయింట్స్
- థ్రిల్లింగ్ స్టోరీ
- గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
- కామెడీ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్:
- కొన్ని చోట్ల లాజిక్ లేకపోవడం
కన్ క్లూజన్ : అనగనగా ఆస్ట్రేలియాలో థ్రిల్లింగ్ స్టోరీ