‘కేజీఎఫ్’ అనంత‌నాగ్ పాత్రలో ప్రకాశ్ రాజ్.. అలా రిప్లేస్ ఎందుకు చేశారంటే?

-

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా సక్సెస్ అయిన ఫిల్మ్ ‘కేజీఎఫ్’. ఇందులో ప్రతీ పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ మలిచిన తీరును చూసి జనాలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే చాప్టర్ 2 ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 14న సినిమా విడుదల కానుంది చిత్రం. ఇటీవల పిక్చర్ ట్రైలర్ రిలీజ్ కాగా, అందులో ప్రకాశ్ రాజ్ పోషించిన పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

శ్రీనిధిశెట్టి ఇందులో హీరోయిన్ కాగా, చాప్టర్ 2 కోసం ఈగర్ గా సినీ లవర్స్ వెయిట్ చేస్తుండగా ఇటీవల విడుదలైన ట్రైలర్ దుమ్మురేపుతోంది. యశ్ పర్ఫార్మెన్స్ చాప్టర్ టూలో నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నదని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. బాలీవుడ్ తారలు రవీనా టండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. అయితే, పార్ట్ టూలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సర్ ప్రైజ్ ప్యాకేజీగా కనిపించారు.

చాప్టర్ వన్ లో అనంత్ నాగ్ పోషించిన పాత్రను ప్రకాశ్ రాజ్ రిప్లేస్ చేశారు. స్టోరిని నెరేట్ చేసే రైటర్ గా అనంత్ నాగ్ కేజీఎఫ్ చాప్టర్ వన్ లో కనిపించారు. ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ చాప్టర్ టూలో పోషించారు. అనంత్ నాగ్ శాండల్ వుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కటి నటుడిగా గుర్తింపు పొందారు. ‘సంకల్ప్’ అనే ఫిల్మ్ తో కన్నడ చిత్రసీమకు పరిచయమయిన అనంత్ నాగ్ ఆ తర్వాత హిందీ భాషలోనూ పలు చిత్రాల్లో నటించారు.

సీరియల్స్ లోనూ నటించిన అనంత్ నాగ్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. తెలుగు చిత్రాల్లోనూ నటించారు అనంత్ నాగ్. రాజకీయాల్లోనూ రాణించారు అనంత్ నాగ్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టర్ గా సేవలందించారు అనంత్ నాగ్. కాగా, చాప్టర్ టూలో మాత్రం అనంత్ నాగ్ పాత్రను రిప్లేస్ చేశారు. బహుశా ఇందుకు గల కారణం చాప్టర్ వన్ సక్సెస్ అయిన నేపథ్యంలో చాప్టర్ టూ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న నటుడి కోసమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రకాశ్ రాజ్ పాత్ర పోషించిన విధానం చూస్తే మాత్రం అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పాత్రకు న్యాయం చేయడంలో ప్రకాశ్ రాజ్ ఎప్పుడు ముందుంటారని కొనియాడుతున్నారు. కాగా, ఎందుకు అనంత్ నాగ్ పాత్రను ప్రకాశ్ రాజ్ తో రిప్లేస్ చేశారనేది దర్శకుడు ప్రశాంత్ నీల్ కే తెలియాలి. ఈ చిత్రం వచ్చే నెల 14న విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version