సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి , పెటాకులు అనే విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక జంట డేటింగ్ పేరిట వార్తల్లో నిలిచింది. అసలు విషయంలోకెళితే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో ఆదిత్యారాయ్ కపూర్ తో ప్రేమలో ఉందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం దీపావళి పార్టీలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా కనిపించిన రోజు నుంచి ఈ వార్తలు బాలీవుడ్లో తెగ వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ వార్తలను కన్ఫామ్ చేస్తూ ఫోటోలను వదిలారు ఈ జంట. తాజాగా అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ రాజధాని అయిన మ్యాడ్రిడ్ లో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక స్పెయిన్ లో దిగిన కొన్ని ఫోటోలను తమ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో అటు అనన్య, ఇటు ఆదిత్య ఇద్దరూ కూడా చాలా క్లోజ్ గా ఉండడం, ఒకరికొకరు హగ్ చేసుకుని మరి ఫోటోలు దిగడం అన్నీ కూడా అఫీషియల్ గా పోస్ట్ చేయడంతో నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
ఇకపోతే ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారగా వీరిద్దరికి దాదాపు 13 ఏళ్ల వయసు తేడా ఉంది అంటూ కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు బాలీవుడ్ లో ఈ జంట హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.