ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే వారిద్దరి పుట్టిన రోజు ఒకటే రోజు కావడం సర్వసాధారణం. కానీ పాకిస్థాన్‌లోని ఓ ఫ్యామిలీలో మాత్రం తొమ్మిది మంది బర్త్ డే ఒకే రోజు కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఆ కుటుంబం పుట్టినరోజు వేడుకలు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాయి.
సింధ్ ప్రావిన్సులోని లర్కానా నగరానికి చెందిన అమీర్ అలి, ఖదీజా దంపతులకు 1992 ఆగస్టు 1న మొదటిపాప పుట్టింది. తర్వాత వరుసగా ఆరుగురు సంతానం అదే తేదీన పుట్టడం విశేషం. ఇలా ఏడుగురు తోబుట్టువుల పుట్టినరోజు ఒకే తేదీన రాగా.. అమీర్, ఖదీజా దంపతుల పుట్టినరోజు, పెళ్లిరోజూ అదే తేదీన కావడంతో.. ఆగస్టు 1 వచ్చిందంటే ఆ ఇంట్లో భారీ సంబురాలే. ఈ పాకిస్థానీ కుటుంబం ‘గిన్నిస్’ గుర్తింపు సాధించింది. గతంలో అమెరికాకు చెందిన కమిన్స్ కుటుంబం పేరిట ఫిబ్రవరి 20న పుట్టిన అయిదుగురు పిల్లలతో ఈ గిన్నిస్ రికార్డు ఉండేది.