ధవళ వస్త్రంలో ధగ ధగ మెరిసిపోతున్న అనసూయ..

-

తన అందంతో బుల్లితెరకి మరింత గ్లామర్ అద్దిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో హీరోయిన్లు మాత్రమే అందంగా కనబడతారు. టెలివిజన్ పై అంత అందమైన వారు ఎవ్వరూ ఉండరు అనుకుంటున్న సమయంలో హీరోయిన్లని మించిన అందంతో అనసూయ కనబడింది. అందుకే బుల్లితెర మీద ఆమె స్టార్ అయ్యింది. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసింది.

జబర్దస్త్ మొదలై ఏడు సంవత్సరాలు కావొస్తున్నా అనసూయ అందం కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. తెలుగు రంగు డ్రెస్సులో కనిపించిన అనసూయ చాలా అందంగా కనిపించింది. ధగ ధగ మెరిసిపోతూ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తుంది. అటు బుల్లితెర మీద యాంకర్ గా కొనసాగుతూనే వెండితెర మీద కూడా తనదైన ముద్రవేస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా ఆమె నటనని ఎప్పటికీ మర్చిపోలేం.

 

Read more RELATED
Recommended to you

Latest news