బాయ్ ఫ్రెండ్ తో హోటల్లో రొమాంటిక్ మూడ్లో యాంకర్.. ఫొటోస్ వైరల్..!!

-

సాధారణంగా ఎవరైనా సరే తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఒక యాంకర్ మాత్రం బెడ్ రూమ్ విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకోవడంతో ఈమెపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లకు కొదవలేదని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది గ్లామర్ లేడీ యాంకర్లు కూడా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప సినిమా ఇంటర్వ్యూ ద్వారా రాయలసీమ యాసలో మాట్లాడి ఒక్కసారిగా ఫేమస్ అయిన యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాయలసీమ యాస లో మాట్లాడుతూ ఈమె చేసిన ఇంటర్వ్యూ మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బిగ్బాస్ ఓటీటీ లో అవకాశాన్ని సంపాదించుకుంది. ఇక అక్కడ కాస్త ఓవర్గా చేసినప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోవడం గమనార్హం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె రకరకాల ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంది. మొన్నటికి మొన్న అషూ రెడ్డి, అఖిల్ సార్ధక్ లతో కలిసి బీచ్ లో బికినీ వేసుకొని రచ్చ చేసిన ఈమె తాజాగా హోటల్ రూమ్లో గ్లామరస్ ఫోటోలతో మరింత రచ్చ చేసింది. ఇక తాజాగా హోటల్ పార్క్ హయత్ కి తన భర్తతో కలిసి డేట్ నైట్ వెళ్లినట్లు సమాచారం.

తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి మరింత హీట్ పుట్టించింది.ఈ ఫోటోలపై స్పందించిన కొంతమంది నెటిజెన్లు ఏంటి ఈ అరాచకం అంటూ కామెంట్లు చేస్తే మరి కొంతమంది తప్పేముంది పాపులర్ కావాలంటే ఇలా చేయాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికి అయితే ఇలాంటి ఫోటోలతోనే స్రవంతి బాగా పాపులర్ అయ్యేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version