వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..టైమ్ ఫిక్స్?

-

రాజకీయాల్లో మైండ్ గేమ్ అనేది ఎక్కువైపోయింది…ప్రత్యర్ధులని దెబ్బకొట్టడానికి ఈ మైండ్ గేమ్ బాగా ఉపయోగపడుతుంది. రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మైండ్ గేమ్ వాడుతూ…దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. అయితే ఈ మైండ్ గేమ్ లో భాగంగానే రెండు పార్టీలు జంపింగ్ జపాంగులపై ఫోకస్ పెట్టాయి.

ఇప్పటికే అధికార వైసీపీలోకి పలువురు టీడీపీ నేతలు చేరిన విషయం తెలిసిందే…నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చేరారు. అయితే ఇదంతా ఏడాది క్రితం వరకే…ఇప్పుడు టీడీపీ నుంచి వలసలు ఆగిపోయాయి. అదే సమయంలో టీడీపీ వలసల కార్యక్రమం మొదలుపెట్టింది…వైసీపీలో ఉండే కీలక నేతలపై వల వేస్తున్నట్లు తెలుస్తోంది..అలాగే ఈ మధ్య వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులని, న్యూట్రల్ గా ఉన్న నేతలని టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే.

అలాగే ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సీటు విషయంలో డౌట్ తో ఉన్నారని, అలాగే ఎంపీలు జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నారని, అలాంటి నేతలు టీడీపీలోకి వచ్చేస్తారని టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.

ఇక టీడీపీ ప్రచారంతో…వైసీపీ నుంచి జంప్ చేసేవారు ఎవరా? అని ఆరా తీసే పరిస్తితి కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి…వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు టీడీపీలోకి వచ్చేస్తారని కథనాలు మొదలయ్యాయి. అయితే ఇదంటే టీడీపీ కుట్ర అని తాను పార్టీ మారే ప్రసక్తి లేదని మాగుంట చెప్పుకొచ్చారు. అంటే ఇది టీడీపీ మైండ్ గేమ్ అని అర్ధమవుతుంది.

అదే సమయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చేస్తారని, పది మందిపైనే ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్తితులు చూస్తే కొందరు ఎమ్మెల్యేలు వైసీపీకి టచ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు పరిస్తితి చూసుకుని వారు వైసీపీలోకి జంప్ చేయడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి రెండు పార్టీల నుంచి జంప్ చేసేది ఎవరో.

Read more RELATED
Recommended to you

Exit mobile version