పొట్టి డ్రెస్సులు వేసుకోవడం దేనికి.. అనసూయ పై యాంకర్ శివ షాకింగ్ కామెంట్స్

-

హైపర్ ఆది పంచులు ఎలా ఉంటాయనేది జబర్దస్త్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తాజాగా జబర్దస్త్ స్కిట్ లో ఆది తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అందులో యాంకర్ అనసూయను కూడా వదల్లేదు. యాంకర్ అనసూయ లేచిపోతా అనగా.. నాతోనా అంటూ వెంటనే పంచు వేశాడు. స్కిట్ లో సూపర్ సినిమాలో అలీ లా అబద్దాలు ఆడితే కనిపెట్టే మిషన్ తో యాంకర్ అనసూయతో ఇంటర్వ్యూ చేస్తాడు. యాంకర్ ఆది గురించి మీ అభిప్రాయం అడిగితే.. తాను, ఆది మంచి ఫ్రెండ్స్ అని అనసూయ చెప్పగా.. మిషన్ అరుస్తుంది. దానికి అనసూయ చిరాకు పడుతూ.. ఇప్పుడు నేను నీతో లేచిపోతానని మా ఇంట్లో వాళ్లతో చెప్పమంటావా.. అని అంటుంది. అప్పుడు మిషన్ ఆల్ రైట్ అని చెబుతుంది. తదనంతరం జడ్జి, ఎమ్మెల్యే, రోజా, మనోను కూడా ఓ ఆట ఆడుకుంటాడు. వారంతా ఆది మిషన్ గోళ.. భరించలేక లేచి వెళ్లిపోతారు.

అనసూయ ఇక అసలు విషయానికి వస్తే… స్కిట్ మొత్తం అయిపోయిన తర్వాత జడ్జిలు అందర్నీ స్టేజీ మీదకి పిలిచిన తర్వాత ఆది టీం సభ్యుడు శివ.. అనసూయను పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటావని.. అడగ్గా.. అది తన పర్సనల్ అని చెప్తుంది. పర్సనల్ అయితే ఇంట్లో వేసుకోవచ్చు.. కదా.. అని అడగడంతో అనసూయ అలిగి కిందికి వెళ్లిపోతుంది. వెళ్తూ… వెళ్తూ… ఎవర్ని పడితే వారిని తీసుకువచ్చి స్కిట్లు చేయించడం మానుకోవాలని, అలా చేస్తే ఇలాగే ఉంటుందని హితవు పలుకుతుంది. తర్వాత హైపర్ ఆది, మిగతా టీం లీడర్లందరూ అనసూయ వద్దకు వెళ్లి.. కొత్త కుర్రాడు తెలియక అడిగాడని సర్ధి చెప్పడంతో అనసూయ శాంతించి.. మరలా స్టేజీ మీదకు యాంకరింగ్ చేసేందుకు వస్తుంది. మరలా ఆది మాట్లాడుతూ… కొత్తకుర్రాడు తెలియక అడిగాడని.. తనకు ముందు చెప్పాల్సిందని అంటాడు. అక్కడ కూడా ఆది తన మార్కు కామెడీతో అలరించాడు. నాకు చెప్తే నేనే అడిగేవాడిని అని అనగా.. అనసూయ పడీపడీ నవ్వుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news