అనసూయ అందం.. ముంగురులకే ముచ్చటేస్తుంది..

జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత సినిమాల్లోనూ కనిపించడం మొదలెట్టింది. ఇటు టీవీ యాంకర్ గా కొనసాగుతూ అటు సినిమాల్లో మంచి మంచి పాత్రలు దక్కించుకుంటుంది. క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసరుగా నెగెటివ్ రోల్ లో కనిపించిన అనసూయకి ఆ పాత్ర మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. ఐతే రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం ఆమె కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.

రంగమ్మత్తగా అనసూయ నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ పాత్రకి అవార్డులు కూడా దక్కాయి. సాధారణంగా టీవీలో కనిపించే వారికి సినిమాల్లో సక్సెస్ రాదని చెబుతుంటారు. కానీ అనసూయ రెండింట్లోనూ విజయాలని అందుకుంటుంది. టీవీ వ్యాఖ్యాతగా, సినిమా నటిగా బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్లతో అభిమానులతో టచ్ లో ఉంటూ తన అభిప్రాయాలని కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెబుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఐతే ఆ విమర్శలకి అనసూయ గట్టిగానే సమాధానం ఇస్తుంది.

ఏ విషయంలో అయినా కుండబద్దలు కొట్టే అనసూయ అప్పుడప్పుడు ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. అదంతా పక్కన పెడితే తాజాగా అనసూయ ట్విట్టర్ ద్వారా ఫోటోలని పంచుకుంది. నీలి కళ్ళున్న అనసూయ నీలిరంగు ఔట్ ఫిట్ లో మెరిసిపోతుంది. ఎలాంటి ప్రత్యేకత లేకుండా చాలా సాదా సీదాగా ఉన్న ఈ ఫోటో దాని ప్రత్యేకతని చాటుతూ చూపరులని ఆకర్షిస్తుంది. చెవి మీది ముంగురులు ముందుకు పడుతూ మొహం పైకి వచ్చేస్తుండగా, ముంగురులకే మోహం పుట్టి మీదకి వచ్చేస్తున్నాయా అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.