అరెస్టుపై యాంకర్ శ్యామల భర్త క్లారిటీ..

టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన యాంకర్ శ్యామల భర్త అరెస్టుపై ఓ క్లారిటీ వీడియో వచ్చింది. ఇటీవల ప్రముఖ ఇటీవల యాంకర్‌ శ్యామల భర్త, సీరియల్స్ నటుడులక్ష్మీ నరసింహా రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయనను రాయదుర్గం పోలీసులు చీటింగ్‌ కేసులో ఓ మహిలను మోం చేశాడని ఆరోపిస్తూ అరెస్ట్‌ చేశారు. ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి తన వద్ద రూ.కోటి అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వమంటే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది.

దీన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు నర్సింహారెడ్డితో పాటు మరో మహిలను కూడా అరెస్టు చేశారు. అయితే దీనిపై యాంకర్ శ్యామల అదే రోజు స్పందిస్తూ.. తన భర్త గురించి తెలుసని.. కానీ ఇంకో మహిళ గురించి తెలియదని చెప్పుకొచ్చింది. కాగా నిన్న బెయిల్‌పై బయటకు వచ్చిన నరసింహారెడ్డి, తన అరెస్ట్‌కు సంబంధించిన కేసుపై స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

తనపై సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు వచ్చాయని.. అవన్నీ అబద్ధమని చెప్పాడు. తనపై పెట్టింది తప్పుడు కేసు అని.. పూర్తి వివరాలతో రెండు రోజుల్లో మీ ముందుకు వస్తా అంటూ చెప్పుకొచ్చాడు. తనకు ఇలాంటి టైమ్ లోఅండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ వీడియోను శ్యామల తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.