యానిమల్ ఓటీటీ రిలీజ్ పై కోర్టుకు కో ప్రొడ్యూసర్

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబోలో ఇటీవల వచ్చిన సినిమా యానిమల్. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో రణ్బీర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డిసెంబర్ 1వ తేదీ ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు రంగం సిద్ధం అవుతోంది. అయితే ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించించిన సినీ1 స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయకూడదంటూ కోర్టును ఆశ్రయించింది. యానిమల్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా స్టే విధించాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసింగ్ సంస్థ టీ-సిరీస్ తో కుదుర్చుకున్న తమ ఒప్పందం ఉల్లంఘనకు గురైందని యానిమల్ కో ప్రొడ్యూసర్ పిటిషన్ వేశారు. అంతే కాకుండా యానిమల్‌లో 35% ప్రాఫిట్ షేర్, మేథో సంపత్తి హక్కులు ఉన్నాయంటూ పిటిషన్లో పేర్కొంది. ఈ సినిమాను నిర్మించడం, ప్రమోట్ చేయడం, విడుదల చేసే విషయంలో టీ-సిరీస్ తమ అనుమతిని తీసుకోలేదని తెలిపింది. మరోవైపు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ టి-సిరీస్ తమ ప్రాఫిట్ షేరింగ్ ఒప్పందాన్ని గౌరవించలేదని, ఆర్థిక పరిహారం అందించడంలోనూ విఫలమైందంటూ ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news