బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యానిమల్. సినిమా టీజర్ రిలీజ్ నుంచి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఆ అంచనాలను అందుకుందని ప్రేక్షకుల చేత మెప్పు పొందింది. ఈ యాక్షన్ డ్రామా డిసెంబరు 1వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.
అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెగ ఎదురుచూశారు. వారి కోసమే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఓ శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటికే మూవీ చూసిన వారికి మరింత సర్‌ప్రైజ్ జోడించి ఓటీటీ వెర్షన్ అందించనున్నారు. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు.