ANIMAL Teaser : రణబీర్, సందీప్ రెడ్డి ‘యానిమల్’ టీజర్ వచ్చేసింది..

-

అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాలతో సూపర్ స్టార్​డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా యానిమల్.

Animal Teaser out

అయితే… సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ రష్మిక జోడిగా నటిస్తున్న యానిమల్ మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో హీరో క్లాస్ మాస్ లుక్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. నేను చెడును వెంటాడుతూ వెళ్లాను… నేనెక్కడ కనబడలేదు నాలో నేను చూసుకున్నాను.. నా కన్నా చెడ్డవాడు లేరు అనే డైలాగ్ మూవీపై ఆసక్తిని పెంచుతోంది. డిసెంబర్ 1న మూవీ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news