ఇండియన్ 2 చిత్రంలో భాగం కానున్న మరో ప్రముఖ హీరోయిన్..!!

-

నట విశ్వ సామ్రాట్ అయినటువంటి కమలహాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సూపర్ హిట్ చిత్రం విక్రమ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో కమలహాసన్ తన కెరియర్ లో భారీ కం బ్యాక్ ఇవ్వగా.. ఇక తన నెక్స్ట్ సినిమాల కోసం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే విక్రమ్ కన్నా ముందే భారీ చిత్రమైన ఇండియన్ 2 సినిమాను విడుదల చేయాలని అందరూ అనుకున్నారు కానీ షూటింగ్లో కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. విజనరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ సినిమాని సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రం ఎప్పుడో మొదలైంది.ఇక కొన్ని కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి సిద్ధం అయ్యింది. ఇకపోతే ఈ చిత్రంపై తాజాగా ఇంకొక అప్డేట్ కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ చిత్రం షూటింగు ఈ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి చెన్నైలో మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షూటింగ్లో కాజల్ తో పాటుగా మరో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా పాల్గొనబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఈమె కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇదిలా ఉండగా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.Indian 2: Rakul Preet starts shooting for Kamal Haasan filmకాజల్ వివాహం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చి చాలా రోజులు గ్యాప్ తీసుకొని.. ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 2 సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యింది. మరి కాజల్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక మరొకవైపు రకుల్ ప్రీతిసింగ్ కూడా తన ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా వేసుకోలేదు. కనీసం ఈ సినిమాతో నైనా ఆ విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news