భద్రాచలంతో గోదావరి నీటిమట్టం 49 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలంతో గోదావరి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం గోదావరి పెరుగుతుంది. నెల రోజుల వ్యవధిలో రెండవసారి గోదావరి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 49 అడుగులు దాటడంతో రెండవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో గోదావరి పర్యాయక ప్రాంతంలో వస్తున్న వరదలు వల్ల గోదావరి ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుంది. గత నెలలో 71.3 అడుగుల వరకు గోదావరి పెరిగిన విషయం తెలిసింది. మళ్లీ అదే స్థాయిలో గోదావరి పెరుగుతుందని భద్రాచలం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 49అడుగులు దాటిన గోదావరి ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.