ఎనదర్ హీరో ఫ్రమ్ మెగా ఫ్యామిలీ

-

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకు ముహుర్తం కుదిరింది. అసలైతే సాయి కొర్రపాటి నిర్మాతగా వైష్ణవ్ తేజ్ సినిమా ఉంటుందని అన్నారు కాని మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారట. సుకుమార్ అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.

ఈమధ్యనే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. డెబ్యూ సినిమా తర్వాత పవన్ సమర్పణలో డాలీ డైరక్షన్ లో మూవీ ఉంటుందని తెలుస్తుంది. పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ సినిమా నిర్మిస్తారట.

మొత్తానికి ఎంట్రీ ఇవ్వడమే మొదటి సినిమాతో పాటుగా రెండో సినిమా కూడా లైన్ లో పెట్టుకున్న ఈ మెగా హీరో దూకుడు చూస్తే సర్ ప్రైజ్ గానే ఉంది. హీరోలైతే వస్తున్నారు కాని విజయాల శాతంలో మాత్రం మెగా హీరోలు అంతగా ప్రభావితం చూపించట్లేదు. మరి ఆ విషయంలో చిరు సలహాలు తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version