రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో మరో సినిమా

-

మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొడుతోంది. యంగ్ హీరోల కన్నా స్పీడ్ గా మూవీలను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ మొదటి నుంచి కూడా తన కెరియర్ విషయంలో మంచి దూకుడు చూపిస్తూ వచ్చాడు. హిట్ .. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

ఫ్లాపులు ఆయన కెరియర్ పై ప్రభావం చూపించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇటీవల ‘ధమాకా’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, ‘రావణాసుర’తో ఫ్లాప్ అందుకోక తప్పలేదు. ఇది ఇలా ఉండగా, తాజాగా మరో సినిమాను ప్రకటించాడు రవితేజ. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు రవితేజ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కాగా.. వీరి కాంబినేషన్‌ లో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. ఇక తాజాగా మరోసారి గోపిచంద్‌ తో రవితేజ్‌ సినిమా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news