సీఎం జగన్ కు మూల్యం చెల్లించుకునే రోజు వచ్చిందన్నారు గంటా శ్రీనివాస్ రావు. మీరు అసంబ్లీలో నొక్కి వక్కాణించి చెప్పిన జులై 8, 2023 వచ్చింది పోయింది జగన్మోహన్ రెడ్డి గారు..? అని ఫైర్ అయ్యారు. మీరు పెంచుతామని చెప్పిన అవ్వాతాతలకు రూ 3000 సంగతి గాలికొదిలేసి పెన్షన్లలో పెద్ద ఎత్తున కోత పెట్టి దాదాపు 6 లక్షల మంది పింఛన్లను తొలగించడంలో మాత్రం సఫలీకృతం అయ్యారన్నారు. ఒక పక్కన అర్హులకు పెన్షన్లను రద్దు చేస్తూ, మరో పక్క పెన్షన్లపై గొప్పలు చెప్పుకొవడం మీకు మాత్రమే సాధ్యం జగన్ గారు…అంటూ చురకలు అంటించారు.
2014లో Telugu Desam Party (TDP) అధికారంలోకి రాగానే రూ.200 ఉన్న పెన్షన్‌ని Nara Chandrababu Naidu గారు ప్రభుత్వం ఒకేసారి రూ.1000కి పెంచారు. అంటే వృద్ధుల పెన్షన్ ఐదు రెట్లు పెరిగింది. 2019 జనవరి నుంచి రూ.2వేలు పెంచి రెట్టింపు చేసి లబ్ధిదారుల సంఖ్యను 54 లక్షలకు పెంచి లబ్దిదారులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు… పెన్షన్లు రూ 3,000 కు పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానిని పెంచుకుంటూ పోతానని చెప్పానని ఒకేసారి రూ. 3000 ఇస్తానని చెప్పలేదని మాట తప్పారని ఆగ్రహించారు. రూ.3,000 కు పెంచుతానని జగన్ హామీఇచ్చి మాట తప్పడం వల్ల ఇప్పటి వరకు ఒక్కో పెన్షన్ దారుడు రూ దాదాపు 33 వేలు నష్టపోయారు…. మళ్ళీ ఎప్పటి లాగే మాట తప్పారూ మడము తిప్పారూ….ప్రజలు మీ కల్లబొల్లి మాటలన్నీ గమనిస్తూనే ఉన్నారు, మీరు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.